Tuesday, November 17, 2009

అనాధ

ఎవరికి ఏమవుతారో తెలియని పసి మనసులవి,
అందరు నావారనుకునే ద్వేషరహిత హృదయాలవి,
కన్నవారెవరో ఎరుగక కాలం కర్కశ కోరల్లో చిక్కి
చేత్తకుప్పల్లోవిసిరి వేయబడి మురికి కూపాలలో మ్రగ్గుతూ
రోడ్లవెమ్మటి సమాజానికి దూరంగా జీవనం సాగించే
ఆ సంచార బ్రతుకుల కధలు కన్నీటి పాలేనా
క్షనికావేశాలకు లోనయి వారిని కనే మనుషులకు
మనసే లేదా , హృదయం అనేది లేదా,
కన్నా ప్రేమకు ఆత్మియతకు వెరచి హేయమైన
జీవితం సాగించే ఆ కుంతి పుత్రులకు మజిలి ఎక్కడ
ఎండకు ఎండి వానకు తడిసి చలిలో మునిగి
ఋతుచక్రం లో బందిలై జీవిస్తున్న వారికీ ఆసరా ఎక్కడ
ఎవరో వోస్తారని ఆశగా ఎదురుచూస్తూ కడుపు నింపుకునే
మార్గం కానరాక చిక్కి శల్యమై మూగగా రోదించే
వారి ఆవేదనకు అంతేది , ఆలకించే దేవరు
ఈ సభ్య సమాజంలో మానవత్వం నశించిందా
ఎ దేవుడు కరునించక ఎ ప్రభుత్వమూ ఆదుకొక
హింసావాదం తో దొంగలుగా సైకోలుగా మారటానికి
కారణం ఎవరు ,కర్కశ హ్రుదయులమైన మనము కాదా
ఈ వేదం చెప్పిన నీతి ఇది, ఏ మతాల సారమిది
షడబిజ్నుడి బోధలు, మేరీ తనయుని సిలువత్యాగం వృధాయేన
ఓ మనిషి మేలుకో మన జాతిని జాగృతం చెయ్యి
పసువులకున్న విచక్షణ మనకు లేదా?
లే చేయూత నందించు ఆ బడుగు జీవులకు
ఆసరాగా నిలుద్దాం. మనమున్నామని నిరూపిద్దాం ..